Tsrtc Cargo: కార్గో ద్వారా గడిచిన రెండేళ్లలో రూ.123 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఇప్పటి వరకు 79 లక్షల మంది వినియోగదారులకు కార్గో, పార్శిల్స్ ద్వారా సేవలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ రోజున చిరుకానుక:ఉద్యోగ విరమణ చేసే వారిని సత్కరించటంతోపాటు సంస్థకు చేసిన సేవలకు గుర్తింపుగా చిరుకానుక ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.