TS RTC Call Center : రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ. 48వేల మంది ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. సంక్రాంతి, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. పెళ్లిళ్లు, శుభాకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తుంది. మేడారం జాతర, అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కార్గో, పార్శిల్ సర్వీసు సేవలు అందిస్తుంది. వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గత పదేళ్ల నుంచి ఆర్టీసీ కాల్ సెంటర్‌ను అందుబాటులో ఉంచింది. అయితే.. గతంలో కొన్నింటికి మాత్రమే కాల్ సెంటర్ వేదికగా ఉండేది. కేవలం బస్సుల వివరాలు మాత్రమే అందించేది. అప్పుడు పొరుగు సేవల వారికి కాల్ సెంటర్‌ను అప్పగించారు.
కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ...
ప్రస్తుతం ఆర్టీసీలో అదనంగా ఉన్నటువంటి కండక్టర్ల సేవలను.. ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఉన్నత చదువులు చదివిన కండక్టర్లను.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషపై పట్టు ఉన్న వారిని ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక శిక్షణను అందించింది. ముందుగా 24 మందిని ఎంపిక చేసి.. వారితో కాల్ సెంటర్‌ను నడిపిస్తోంది. మరో 24 మందిని కూడా ఎంపిక చేశారు. ప్రస్తుతం వారు శిక్షణలో ఉన్నారు. వారి శిక్షణ పూర్తయితే.. మొత్తం 48 మందితో కాల్ సెంటర్‌ను పూర్తి స్థాయిలో నడిపించాలని ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.
అవగాహన ఉన్నవారు కావడంతో..