ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు తెలంగాణ బంద్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామున వివిధ పార్టీల, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హయత్‌నగర్ డిపో-1,2లలో మొత్తం 271 బస్సులుండగా.. భారీ బందోబస్తు మధ్య పోలీసులు ఆరు బస్సులను రోడ్డెక్కించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.