TSRTC offers 10 per cent discount on Bengaluru -Vijayawada routes : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు, విజయవాడ రూట్‌లలో టికెట్‌పై 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో జున్ 2 నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే మాత్రమే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది.
TSRTC official Website: ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుందని పేర్కొంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.comలో చేసుకోవాలని సూచించారు. 60 రోజులు ఉంటుండగా ముందస్తు బస్సు రిజర్వేషన్ చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఛార్జీలో రాయితీ ఇవ్వడం వల్ల ప్రయాణికులకి ఆర్థిక భారం తగ్గుతోందని వెల్లడించింది.