తెలంగాణలో ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా నిత్యావసర సరుకుల రవాణా ప్రారంభించారు. ఉదయం జేబీఎస్ నుంచి మూడు బస్సుల ద్వారా... జగిత్యాల, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరుకులు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా నిత్యావసరాల రవాణా - tsrtc bus cargo services for transport of daily needs
రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా నిత్యావసర సరుకుల రవాణాను ఇవాళ ఉదయం ప్రారంభించారు. జేబీఎస్ నుంచి మూడు బస్సుల ద్వారా జగిత్యాల, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సేవలు అందించారు.
ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా నిత్యావసరాల రవాణా
లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులన్నీ నిలిచిపోయినందున రవాణా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి :నేటి నుంచి పీజీ వైద్య విద్య ప్రవేశాలు