తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC offer on Mother's day : మదర్స్ డే స్పెషల్.. 'అమ్మ'కు ఆర్టీసీ బంపర్ ఆఫర్ - mothers day tsrtc offer 2022 in hyderabad

TSRTC offer on Mother's day : టీఎస్​ఆర్టీసీ మహిళలకు మరో కానుకను ప్రకటించింది. ఆదివారం మాతృ దినోత్స‌వం సందర్భంగా వారికి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ అవకాశమిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

TSRTC special buses on Mothers day
మాతృమూర్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

By

Published : May 7, 2022, 6:50 AM IST

TSRTC offer on Mother's day : మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ మరో కానుక అందిస్తోంది. అన్ని ఆర్టీసీ స‌ర్వీసుల‌్లో మాతృమూర్తులకు ఉచిత ప్ర‌యాణం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్ర‌మే అన్ని బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.

అమ్మ అనురాగాన్ని, ప్రేమ‌ను వెల‌క‌ట్ట‌లేమంటూ ఆ త్యాగ‌మూర్తి సేవ‌ల‌ను గుర్తించుకుని మ‌ద‌ర్శ్​ డే సందర్భంగా వారికి ప్ర‌త్యేకంగా ఉచిత ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పించామని వెల్లడించారు. ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులంద‌రూ ప‌ల్లె వెలుగు నుంచి ఏసీ స‌ర్వీసుల వ‌ర‌కు అన్ని బ‌స్సుల‌లో ఈనెల 8వ తేదీన ఉచిత ప్ర‌యాణాన్ని కొన‌సాగించ‌వ‌చ్చ‌ని స్ఫ‌ష్టం చేశారు. మాతృ దినోత్స‌వం రోజున టీఎస్​ఆర్టీసీ క‌ల్పిస్తున్న ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా కోరారు.

ABOUT THE AUTHOR

...view details