టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరారు.
వివిధ దశల్లో సమావేశాలు...
టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందాలపై వివిధ దశల్లో సమావేశాలు నిర్వహించారని.. సమస్యలను మాత్రం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తీవ్ర వ్యతిరేకత..
ప్రైవేట్ అక్రమ రవాణా ద్వారా ఆర్టీసీ నడపడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వెంటనే ఈ విషయంపై సీఎం కేసీఆర్ కల్పించుకోవాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి వినతి పత్రాన్ని అందజేశారు.
అక్కడ వెయ్యి బస్సులు, ఇక్కడ 750 బస్సులు..
ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు రెండు లక్షల అరవై మూడు వేల కిలోమీటర్ల మేర తిప్పుతూ వెయ్యి బస్సులను నడుపుతోందన్నారు. అదే తెలంగాణ ఆర్టీసీ 1,53,000 కిలోమీటర్లలో 750 బస్సులు నడపుతోందని రాజిరెడ్డి వివరించారు.