టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక - TSPSC TRT PET results latest news
19:35 December 05
టీఆర్టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక
టీఆర్టీలో తెలుగు మాధ్యమం వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలకు 364 మంది అభ్యర్థులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 370 పీఈటీ ఉద్యోగాలకు 2017 అక్టోబరు 21న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి.. గతేడాది ఫిబ్రవరి 28న రాతపరీక్ష నిర్వహించింది. అర్హులైన అభ్యర్థులు లేకపోవడం వల్ల మరో 6 పోస్టులను భర్తీ చేయలేదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
ఇవీ చూడండి:వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష