తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC పేపర్​ లీకేజీ కేసు.. విదేశాల్లో ఉన్న బంధువులను తీసుకొచ్చి గ్రూప్‌-1 రాయించాడు?

Rajasekhar role in TSPSC paper leak case: టీఎస్​పీఎస్​సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది అన్న చందాగా నిందితులు లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ కేసులో ఏ-2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్​.. తన సమీప బంధువులిద్దరిని విదేశాల నుంచి తీసుకొచ్చి గ్రూప్​-1 పరీక్ష రాయించినట్లు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. వారి ఇరువురు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించినట్లు గ్రామస్థులు తెలపగా.. వారి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.

Rajasekhar
Rajasekhar

By

Published : Mar 18, 2023, 10:11 AM IST

Rajasekhar role in TSPSC paper leak case: టీఎస్‌పీఎస్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఎ-2 నిందితుడుగా ఉన్న కార్యాలయ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి రాజశేఖర్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రాజశేఖర్‌.. వారి సమీప బంధువులిద్దరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు హాజరైనట్లు స్థానికుల ద్వారా తెలిస్తోంది.

నిందితుడు వ్యవహారం బయటపడటంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న ఆ దంపతులు స్వదేశానికి వచ్చి గ్రూప్స్‌ రాసిన తీరుపై స్థానికంగా పెద్ద చర్చ సాగుతోంది. వీరిద్దరు గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో అర్హత సైతం సాధించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్లు తెలుస్తోంది. రాజశేఖర్‌ 2012లో ఉపాధి కోసం అఫ్గానిస్థాన్‌ వెళ్లి 2016లో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు.

కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌పై పట్టున్న ఆయన.. కొన్నాళ్లు హైదరాబాద్‌లోని పలు కంప్యూటర్‌ విభాగాల్లో అడ్మిన్‌గా కీలక బాధ్యతల్ని నిర్వహించాడు. కరీంనగర్‌కు చెందిన బంధువుల ద్వారా పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో తాత్కాలిక ఉద్యోగిగా చేరినట్లు స్థానికులు అంటున్నారు. టీఎస్​పీఎస్​సీలో ఉద్యోగం వచ్చిన తరువాతే ఊరిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నాడని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామానికి వచ్చిన సమయంలో కొద్ది మంది స్నేహితులతోనే గడిపేవాడని.. రాజశేఖర్​కు లక్షల రూపాయాల్లో జీతం వస్తుందనుకునేవారమని గ్రామస్థులు చెబుతున్నారు.

Praveen role in TSPSC paper leak case: మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్​ చేసిన దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. టీఎస్​పీఎస్​సీలో అన్ని తానే అన్నట్లు వ్యవహరించిన ప్రవీణ్​ తన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని ఎంతో మంది అమ్మాయిలపై కన్నేశాడు. నిందితుడు సెల్​ ఫోన్​లో డెటా పరిశీలించగా.. కొందరి యువతులు నగ్న వీడియోలు, వీడియో కాల్​లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతులు ప్రవీణ్​ వికృతి చేష్టాలను భరించారా.. లేకుంటే ప్రశ్నాపత్రాలు అడ్డుపెట్టుకొని నిందితుడు వారితో ఇలా ప్రవర్తించాడనేది ప్రశ్నగా మారింది.

లీకేజీ వ్యహారంలో ఒకటి, రెండు పరీక్షలకు పరిమితం కాలేదని అక్టోబర్‌ నుంచే రాజశేఖర్‌, ప్రవీణ్‌లు కలిసి ఈ వ్యహారం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​లో అన్నీ తామై వ్యవహరించిన వీరు తోడుదొంగల్లా మారి అన్ని పరీక్షలపైనా కన్నేసినట్లు పోలీసులు గుర్తించారు. రేణుక అడిగినందుకే ప్రశ్నపత్రం ఇచ్చానని ప్రవీణ్‌ చెప్పిన కథ అంతా నాటకమని తేలింది. లక్షలాది మంది భవితవ్యం నిర్దేశించే పరీక్షా పేపర్లు అలవోకగా కొట్టేస్తున్నా.. సంబంధిత అధికారులు గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం.. వెలుగులోకి సంచలన విషయాలు

TSPSC Reschedule: నాలుగు పరీక్షలు రద్దు.. రీషెడ్యూల్‌పై టీఎస్​పీఎస్సీ ఫోకస్

'కొడుకు నాకు పుట్టలేదనేసరికి తట్టుకోలేకపోయా'.. అనాజ్​పూర్ జంట హత్యల కేసు నిందితుడు ధన్​రాజ్

ABOUT THE AUTHOR

...view details