TSPSC Paper Leakage Case Updates : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నర్సింగరావు.. ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని సేకరించాడని అధికారులు గుర్తించారు. వీరిద్దరు స్నేహితులు అయినందున డబ్బు తీసుకోకుండానే ప్రశ్నపత్రాన్ని నర్సింగరావుకు ప్రవీణ్ ఇచ్చాడని తెలుసుకున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 44కు చేరుకుంది.
AE Paper Leakage Case IN TS : ఏఈ సివిల్ పేపర్ భారీ ఎత్తున చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇటీవల కీలక నిందితుడు రవికిషోర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. నిందితుల చిట్టా పెరిగిపోతుంది. అతని వద్ద ప్రశ్నా పత్రం విక్రియించిన వారి వేటలో సిట్ పోలీసులు ఉన్నారు. ఇదే క్రమంలో వరంగల్‌కి చెందిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
TSPSC paper Leakage case : శనివారం అతనితో పాటు పోలీసులు మరో నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్.. డీఈ రమేష్ కనుసన్నల్లోనే ప్రశ్నా పత్రాలు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. డీఈ రమేష్.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అభ్యర్ధులకు వివిధ అంశాలపై శిక్షణనిచ్చారు. ఆ సమయంలో అక్కడి అభ్యర్ధులతో పరిచయాలను అడ్డుపెట్టుకొని దందా కొనసాగించినట్టు నగర సిట్ పోలీసులు గుర్తించారు.