TSPSC Paper Leakage Case Latest Update : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు మరొకరినిఅరెస్టుచేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం. నాగరాజు అనే యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన ఏఈ పోల రమేష్ నుంచి సేకరించిన సమాచారంతో పాటు సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్... తాజాగా నాగరాజును అరెస్ట్ చేసింది.
SIT Investigation in TSPSC Paper Leak : మున్సిపల్ ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పోల రమేష్ నుంచి కొనుగోలు చేసేందుకు నాగరాజు 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా కొంత మొత్తాన్ని రమేష్‌కు బదిలీ చేశాడు. అనంతరం పరీక్ష రాసిన నాగరాజు... 16వ ర్యాంకు సాధించాడు. దర్యాప్తులో భాగంగా నాగరాజు కోసం రామాపురం వెళ్లిన సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కాగా పోల రమేష్ ఇప్పటికే 7గురికిఏఈఈ, డీఏవో పరీక్ష కోసం హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేశాడు. పరీక్షా కేంద్రాల యాజమాన్యం, అధ్యాపకుల సహాకారంతో జవాబులను మైక్రో ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా ఒప్పందం చేసుకున్న అభ్యర్దులకు అందించాడు. మరోవైపు ఏఈ ప్రశ్నాపత్రాలను విక్రయించాడు.