Assistant Executive Engineer Recruitment Exam: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీతో రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నియామక పరీక్షల కొత్త తేదీలను పబ్లిక్ సర్విస్ కమిషన్ ప్రకటించింది. మే 8వ తేదీన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.. మే 9వ తేదీన అగ్రికల్చర్, మెకానికల్ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు మే 21న ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీస్సీ పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష వారం ముందు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ తెలిపింది.
TSPSC Exam Time Table: పేపర్ లీకేజీ ఘటన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా టీఎస్పీఎస్సీ.. మంగళవారం హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ నెల ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సిట్ అధికారుల సూచనలు, కొన్ని పేపర్లు నిందితులు లీక్ చేసారనే అనుమానంతో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసింది. గ్రూప్-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించిన కమిషన్ వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై కమిషన్ ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి.. జులై 1వ తేదీన గ్రూప్-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
గ్రూప్-1 ప్రశ్నాపత్రం ఐదుగురికి..: ఈ కేసులో నిందితులను విచారిస్తోన్న సిట్ అధికారుల బృందం ఈ క్రమంలో గ్రూప్1 పరీక్షల రాసిన అభ్యర్థులను సైతం విచారించింది. మొత్తం 84 మంది అభ్యర్థులను విచారించిన సిట్.. ప్రిలిమినరి ప్రశ్నాపత్రం ఐదుగురికే చేరినట్టు ఆధారాలు సేకరించింది. ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12 మందికి చేరినట్లు విచారణలో తేల్చింది. మరోవైపు చంచల్‌గూడ జైళ్లో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్ , సురేశ్‌ను న్యాయస్థానం అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.