తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ బోర్డు సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా - TSPSC Latest News

TSPSC Member Karam Ravinder Reddy Resigned Today : టీఎస్​పీఎస్సీ బోర్డులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పబ్లిక్ సర్వీస్​ కమిషన్ సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా చేశారు. ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

TSPSC Latest News
TSPSC Member Karam Ravinder Reddy Resigned Today

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 7:51 PM IST

TSPSC Member Karam Ravinder Reddy Resigned Today : గత ప్రభుత్వంలో వరుస పేపర్​ లీకేజీలతో సంచలనంగా మారిన టీఎస్​పీఎస్సీ(TSPSC) బోర్డులోని సభ్యుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా చేశారు. కమిషన్​లో చోటు చేసుకున్న అపవాదును సంబంధంలేని వారు కూడా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా - అశోక్​నగర్​లో నిరుద్యోగుల సంబురాలు

ఇద్దరు వ్యక్తుల తప్పిదంవల్ల బోర్డు మనుగడే ప్రశ్నార్థకంగా మారందని కారం రవీందర్​రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేదనే సంస్థలో జరిగిన పరిణామాలను తమకు ఆపాదించారని విమర్శించారు. టీఎస్​పీఎస్సీలో సరిపడా సిబ్బంది లేకపోయినా నిరుద్యోగులకు మంచి జరగాలనే ఉద్దేశంతో నియామక ప్రక్రియ వేగమంతం చేశామన్నారు. నిరుద్యోగులకు సంస్థపై ఉన్న అపోహను పక్కన పెట్టాలని పేర్కొన్నారు.

TSPSC Latest News :టీఎస్​పీఎస్సీలో వరుస పెట్టి ప్రశ్నాపత్రాలు లీకవడం సంచలనంగా మారాయి. గ్రూప్​-1, ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలను కమిషన్​ ఉద్యోగులు ప్రవీణ్​, రాజశేఖర్​రెడ్డిలు లీక్​ చేశారు. గత ప్రభుత్వం హయాంలో సిట్​ను నియమించి లీకేజీలో భాగస్వాములైన వారందరినీ అరెస్టు చేశారు. రెండోసారి గ్రూప్​-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో నిరుద్యోగుల్లో బోర్డుపై సమ్మకం పూర్తిగా పోయింది. కమిషన్​ను రద్దు చేయాలని, బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం

గత బీఆర్​ఎస్​(BRS) ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ సభ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు పలుమార్లు ధర్నాకు దిగారు. ఎన్నికల ముంగిట టీఎస్​పీఎస్సీ అంశం మరింత హాట్​ టాపిక్​గా మారింది. తాము అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా జాబ్​ క్యాలెండర్​ సైతం ప్రకటించింది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీపై దృష్టి సారించింది. సీఎం రేవంత్​రెడ్డితో పబ్లిక్​ సర్వీస్ కమిషన్​ ఛైర్మన్​ జనార్దన్​రెడ్డి సమావేశమైన కొన్ని గంటల్లోనే ఛైర్మన్​ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు యూపీఎస్సీ విధానంపై అధ్యయనం చేయాలని రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్​ సర్వీస్​ కమిషన్లపై అధ్యయనం చేయాలని, సమగ్ర అధ్యయం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.కమిషన్​లో పేపర్‌ లీకేజీలు సహా ఉద్యోగాల భర్తీ తీరుపై పూర్తి స్థాయి విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్

ABOUT THE AUTHOR

...view details