రాష్ట్రంలో ఉద్యోగాల నియామక ప్రకటనల పరంపర కొనసాగుతోంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. గ్రేడ్ వన్, గ్రేడ్ టూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మ్యాట్రన్, వార్డెన్, మహిళ సూపరింటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జనవరి 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
సంక్షేమ హాస్టళ్లలో పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ - హైదరాబాద్ తాజా వార్తలు
రాష్ట్రంలో కొలువుల మేళా కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి వేగంగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. తాజాగా సంక్షేమ హాస్టళ్లలో వివిధ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
Jobs notification