tspsc group1: రాష్ట్రంలో గ్రూప్-1 ప్రకటన జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ వాటిని క్రోడీకరిస్తోంది. మొత్తం 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది. అవి రాగానే ప్రకటన జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.
గ్రూప్1 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతిచ్చిన మరుసరి రోజు నుంచే కమిషన్ ఆయా విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. పొరపాట్లకు తావులేకుండా ప్రతిపాదనలను సకాలంలో అందించేందుకు ప్రొఫార్మా సైతం అందించింది. అయినా నాలుగైదు విభాగాల ప్రతిపాదనల తయారీలో సాంకేతిక పొరపాట్లు తలెత్తగా వాటిని సవరించాలని కమిషన్ సూచించింది. ఆ సమాచారం అందితే త్వరలోనే గ్రూప్-1 ప్రకటన జారీ అయ్యే అవకాశాలున్నాయి.