గ్రూప్1 పరీక్ష కటాఫ్ మార్కులపై టీఎస్పీఎస్సీ స్పష్టతనిచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో కనీస మార్కులు ఉండవని ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం వడపోత మాత్రమేనన్న టీఎస్పీఎస్సీ.. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగినట్లు తెలిపింది. మల్టీజోన్, రిజర్వేషన్ ప్రకారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. కటాఫ్ మార్కులంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నందున టీఎస్పీఎస్సీ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
గ్రూప్1 కటాఫ్ మార్కుల ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ - clarity on Group 1 cutoff marks
22:20 October 17
గ్రూప్1 కటాఫ్ మార్కుల ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3 లక్షల 42 వేల 954 మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 1019 కేంద్రాల్లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8:30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు.
ఇవీ చూడండి..
ప్రశాంతంగా గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష.. 75 శాతం హాజరు నమోదు