తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC Group 3 Application Edit Option : గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్​ అలర్ట్‌.. దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం - Hyderabad Latest News

TSPSC Group 3 Application Edit Option : గ్రూప్​-3 అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ బిగ్​ అప్డేట్​ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు సవరణలకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో వివరాలు మార్పులు చేసుకునే వారు ఈనెల 16వ తేదీ నుంచి 21 సాయంత్రం 5 గంటల వరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది.

Telangana Group 3 Notification
TSPSC Group 3 Application Edit Option

By

Published : Aug 14, 2023, 9:40 PM IST

TSPSC Group 3 Application Edit Option : టీఎస్​పీఎస్సీ (TSPSC) నిర్వహించే తెలంగాణ గ్రూప్​-3 పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు కమిషన్​ అవకాశం కల్పించింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 10గంల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తులను సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు(Group III services) ఉద్యోగాలకు గత డిసెంబర్​లో పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నోటిఫికేషన్​​ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టీఎస్​పీఎస్సీ గ్రూప్​3 సిలబస్​ విడుదల..

Telangana Group 3 Notification :గ్రూప్​ 3 నోటిఫికేషన్​కు సంబంధించి.. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1,363 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లే చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తొలిగ్రూప్‌-3 నోటిఫికేషన్​ కావడంతో అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. మొత్తం 5లక్షల 36వేల 477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ తెలిపింది. గ్రూప్​ 3 పరీక్ష మూడు పేపర్లు ఉండగా.. మొత్తం 450 మార్కులు కేటాయించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్​కు సంబంధించి అత్యధికంగా ఆర్థికశాఖలో 712 పోస్టులు ఉన్నాయి.

TSPSC Group 1 Results 2023 : ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. ప్రత్యేక ప్రణాళిక షురూ

Telangana Group 2 Exams Reschedule : అభ్యర్థుల ఆందోళనలు, విజ్ఞప్తుల మేరకు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్​- 2 (Telangana Group 2 Exam) పరీక్షలను రీ షెడ్యూల్​ చేసిన విషయం తెలిసిందే. ఈనెల చివరి వరకు గురుకుల పరీక్షలు ఉండటంతో కొందరు అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాలేమని ఆందోళన చేయగా.. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి.

దీంతో వారి అభ్యర్థన మేరకు నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్ణయించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఈ నోటిఫికేషన్​కు సంబంధించి సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Telangana Group 1 Final Key :మరోవైపు తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి తుది కీను టీఎస్‌పీఎస్సీ ఈనెల మొదటి వారంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్‌ 28వ తేదీన ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. ప్రాథమిక కీను మొదట కమిషన్​ విడుదల చేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది కీను విడుదల చేసింది.

Telangana Group1 Prelims Final Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల

TSPSC Paper Leak Arrests : పేపర్‌ లీకేజ్‌ కేసులో మరో 19 మంది అరెస్టు.. 74కు చేరిన సంఖ్య

Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

ABOUT THE AUTHOR

...view details