TSPSC Group 1 Results : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నటీఎస్పీఎస్సీఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు ప్రారంభించింది. న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల తుది కీ వెల్లడించి.. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు ప్రకటించనుంది. అభ్యర్థుల సంఖ్య మేరకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తూ, వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
TSPSC Group 1 Prelims Result 2023 :టీఎస్పీఎస్సీ ప్రస్తుతం 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రోజూ 16 గంటలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల గ్రూప్-1 పరీక్షను కమిషన్‌లోని 10 మంది ఉద్యోగులు రాశారు. వీరంతా నిబంధనల మేరకు నిర్బంధ సెలవులు పూర్తి చేసుకుని తాజాగా విధులకు వచ్చారు. వీరికి గ్రూప్స్‌కు సంబంధించినవి కాకుండా ఇతర పనులు అప్పగించారు. అందుబాటులోని ఉద్యోగులతోనే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మెరిట్ జాబితాల వెల్లడితో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఉద్యానాధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి. ఇందులో కొన్ని పోస్టులకు తుది కీ ఇప్పటికే వెల్లడైంది. ఏఈఈ పోస్టులకు వచ్చే సోమవారం తుది కీ వెల్లడించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రూప్-1 పరీక్ష.. ప్రిలిమినరీకీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్.. తుది కీని సోమ లేదా మంగళవారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.