TSPSC Group 1 Exam Primary Key : రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని, ప్రాథమిక కీని త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసి తుది కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. అనంతరం మూల్యాంకనం నిర్వహించి ఫలితాలు విడుదల చేయ్యాలని భావిస్తోంది.
TSPSC Group 1 Exam Prelims Results : ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయ్యాలని కమిషన్ చూస్తోంది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత అభ్యర్ధులకు 3 నెలల సమయం ఇచ్చి ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయనుంది. ప్రస్తుతం సెప్టెంబరు నెలాఖరు వరకు ఇతర పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలల్లోగ్రూప్-1 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఆదివారం జరిగిన గ్రూప్-1 పునఃపరీక్షను ఇంతకు ముందు కంటే 50వేల మంది తక్కువ రాశారు. వీరిలో కొంతమంది అభ్యర్థులు గ్రూప్-2, 4 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంపై దృష్టి పెడుతున్నందున ఈ పరీక్షను రాయలేదని తెలుస్తోంది.
Group 1 Mains Exam In October :ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పలు మార్పులు తీసుకువచ్చింది. కమిషన్ ఉద్యోగులు ఎవరైనా పరీక్షలు రాస్తే వారికి నిర్బంధ సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రూప్-1 పునఃపరీక్షకు పది మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగావారితో పరీక్షకు ముందు రెండు నెలలు.. పరీక్ష తరువాత 10 రోజుల పాటు సెలవులు పెట్టించారు. తర్వాత జరగబోయే మిగతా పరీక్షలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు రాసేవారు నిర్బంధ సెలవుల్లోకి వెళ్లడం వల్ల ఇతర సిబ్బంది అదనపు గంటలు పని చేస్తున్నారు. ఆదివారం రోజునగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది... కాగా సిబ్బంది మాత్రం తెల్లవారుజాము 3 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహించారు.
Group 1 Mains Exam In November : గ్రూప్-1 దరఖాస్తు చేయకున్నా జక్కుల సుచరిత అనే అభ్యర్థిని హాల్‌టికెట్ జారీ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.ఈ విషయంపై విచారణ జరిపిన కమిషన్ ఆ ప్రచారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేసిన వారికి నోటీసు జారీ చేయాలని నిర్ణయించింది. జక్కుల సుచరిత గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని గతేడాది అక్టోబరు 16వ తేదీన నిజామాబాద్‌లోని ఏహెచ్ఎంవీ జూనియర్ కాలేజీలో పరీక్ష రాశారని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. పరీక్షకు సంబంధించిన ప్రతి రికార్డు కమిషన్ వద్ద ఉన్నాయని అన్నారు. జూన్ 11వ తేదీన జరిగిన గ్రూప్-1 పునఃపరీక్ష రాసిన వారందరికి హాల్‌టికెట్లు జారీ చేశామని చెప్పారు. సుచరిత అనే అభ్యర్థిని గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయలేదు అన్న సమాచారం సత్యదూరమని అన్నారు.
ఇవీ చదవండి: