Librarian Recruitment Exam Hall Tickets: ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో ప్రకటించిన లైబ్రేరియన్ నియామక పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. హాల్ టికెట్లు వెబ్సైట్లో ఉంటాయని.. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు అనుమానాలు వీడి పరీక్షలకు హాజరుకావాలని కమిషన్, అధికారులు సూచించారు.
TSPSC: లైబ్రేరియన్ నియామక పరీక్ష యథాతథం - TSPSC paper leak case
![TSPSC: లైబ్రేరియన్ నియామక పరీక్ష యథాతథం TSPSC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18372722-917-18372722-1682692697115.jpg)
19:55 April 28
లైబ్రేరియన్ నియామక పరీక్ష మే 17న యథాతథం: టీఎస్‌పీఎస్‌సీ
TSPSC paper leakage case update: మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మైబయ్య, జనార్ధన్‌ల తొలి రోజు కస్టడీ ముగిసింది. కేసు దర్యాప్తులో భాగంగా అందిన కీలక సమాచారంతో.. ఈనెల 20న మహబూబ్‌నగర్‌కు చెందిన మైబయ్య అతని కుమారుడు జనార్ధన్‌ను అరెస్టు చేశారు. జనార్ధన్ కోసం డాక్య నాయక్ నుంచి రెండు లక్షలకు ఏఈ పేపర్ మైబయ్య కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మాస్టర్ పేపర్‌ను ప్రిపేరై జనార్ధన్ పరీక్ష రాశాడు.
చంచల్‌గూడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు నిందితులను కస్టడీకి కోరగా.. నేటి నుంచి మూడు రోజులు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. డాక్య నాయక్ నుంచి మరెవరైనా కొన్నారా అనే కోణంలో మైబయ్య, జనార్దన్‌ను సిట్ అధికారులు మొదటి రోజు విచారించారు.
ఇవీ చదవండి: