TSNAB Director Sandeep Shandilya on Alprazolam Drug :మాదక ద్రవ్యాల్లో అల్ఫాజోలం కొకైన్(Cocaine Drug) కంటే ప్రమాదకరమని, అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్‌న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా హెచ్చరించారు. తెలంగాణలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందని, అల్ఫాజోలం రవాణా, పలువురి చేతులు మారటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. ఇటీవల రూ.3.14 కోట్లు విలువ చేసే 31.42 కిలోల అల్ఫాజోలాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు.
TSNAB Focus on Drugs Control in Telangana : ఈ సమాచారం ఆధారంగా టీఎస్‌న్యాబ్ పోలీసులు రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిన్నారంలోని మూతపడిన పరిశ్రమలో 14 కిలోల నార్డజెపమ్ డ్రగ్ పట్టుబడిందని తెలిపారు. ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేసినట్లు వివరించారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నామని, ఇతను విజయవాడ పరమేశ్వరా కెమికల్స్(Chemicals) ఎండీకి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపై టీఎస్‌న్యాబ్ ఫోకస్ - బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో తనిఖీలకు సమాయత్తం
Sandeep Shandilya on Drugs Control in Telangana :చర్లపల్లిలో ఓ పరిశ్రమను లీజ్‌కు తీసుకుని లింగయ్య గౌడ్‌తో కలిసి కిరణ్ అల్ఫాజోలం తయారు చేస్తున్నారన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఈ దందాలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన పార్శిళ్లలో సైతం 34 కిలోలు పలువురి చేతులు మారినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇలా అల్ఫాజోలం విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు సహా కామారెడ్డికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.