TSLPRB Focus On Police Candidates Training : రాష్ట్రంలో పోలీసు అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే ఎస్సైల ఎంపిక జాబితాను ప్రకటించిన మండలి.. కానిస్టేబుళ్ల ఎంపిక జాబితాను కూడా ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల 554 మంది కొత్త ఎస్సైలను ఎంపిక చేయగా.. ఇంకా 9,871 మంది కానిస్టేబుళ్లకు అక్టోబరు నుంచి శిక్షణ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లలో పోలీస్ శాఖ నిమగ్నమైంది.
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలలో ఎంపికైన వారికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు నియామక మండలి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఏర్పాట్లలో భాగంగా శిక్షణా ప్రాంతాల్లో ఉన్న మైదానాలు చదును చేయడం, వారికి వసతి కల్పించడం వంటి అనేక పనులను చేపట్టింది. ఈ శిక్షణార్థుల్లో దాదాపు 2,000 మంది మహిళల కోసం ప్రత్యేకంగా 3 కేంద్రాలను కేటాయించారు.
Police Candidates Training October : కానిస్టేబుళ్ల ఎంపిక జాబితాను ప్రకటించిన తర్వాత.. 20 రోజుల పాటు వారిపై స్పెషల్ బ్రాంచ్ విచారణ చేయనుంది. అనంతరం ఎలాంటి సమస్యలు లేనివారి పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సవ్యంగా సాగితే అక్టోబరు ఒకటి నుంచే కానిస్టేబుళ్ల శిక్షణను ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వీరికి శిక్షణ విభాగం నేతృత్వంలో, ఎస్సైలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ(TSPA) ఆధ్వర్యంలో 9 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
SSC Jobs : ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో 1876 ఎస్ఐ పోస్టుల భర్తీ!
Telangana Police Training For 9 Months :మరోవైపు సరిపడా మైదానాలు లేకపోవడంతో ఈసారి కూడా టీఎస్‌ఎస్‌పీ శిక్షణను రెండో విడతలోనే నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించగా.. జైళ్లు, ఫైర్ తదితర విభాగాల పోస్టులు పోనూ 14,881 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేయనున్నారు. వీరిలో టీఎస్‌ఎస్‌పీ 5,010, సివిల్ 4,965, ఏఆర్ 4,523, పీటీవో 121, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో 262 కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే వీరిలో 12 వేల మందికి సరిపడా శిక్షణా మైదానాలు మాత్రమే ఉన్నాయి. అయితే 2018 నోటిఫికేషన్‌లో ఎంపికైన 16 వేల మంది శిక్షణకు మైదానాలు సరిపోకపోవడంతో 9 నెలలు శిక్షణను టీఎస్‌ఎస్‌పీ వాయిదా వేసింది.