రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిందని హెచ్‌ఆర్సీ కమిషనర్ జస్టిస్ చంద్రయ్య స్పష్టం చేశారు. బాధ్యతలు తీసుకోగానే మొదటగా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించినట్లు వెల్లడించారు. ఉస్మానియాలో రోగులకంటే సహయకులు ఉండడం కొంత అపరిశుభ్రంగా మారుతుందని జస్టిస్ చంద్రయ్య తెలిపారు.
ఉస్మానియాను సందర్శించిన హెచ్‌ఆర్సీ బృందం - TSHRC TEAM VISITED OSMANIA HOSPITAL IN HYDERABAD
హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బృందం సందర్శించింది. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోగులను వైద్యులు ఆప్యాయంగా పలకరిస్తూ... వైద్యం చేయాలని కమిషన్ ఛైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య సూచించారు.
TSHRC TEAM VISITED OSMANIA HOSPITAL IN HYDERABAD
రోగులను అప్యాయంగా పలకరించే లక్షణం వైద్యులకు ఉండాలన్నారు. రోగులను చూడకుండానే కొందరు వైద్యులు రిపోర్టులను చూసి వైద్యం చేయడం బాధాకరమన్నారు. అన్ని సర్కారు ఆస్పత్రులను హెచ్‌ఆర్సీ సందర్శిస్తుందని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తామని జస్టిస్ చంద్రయ్య తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు