ముఖ్యమంత్రి సూచించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు మరింత రెట్టింపు ఉత్సాహంతో విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఇంజినీర్లు పని చేయాలని టీఎస్ జెన్కో ఎండీ ప్రభాకర్ రావు కోరారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభకు హాజరయ్యారు. టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్లతో కలిసి డైరీ, క్యాలెండర్‌ను ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. 24గంటల విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని చేధించినప్పటికీ... దానిని నిలబెట్టుకోవాలని ప్రభాకర్ రావు ఇంజినీర్లకు సూచించారు.
ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ... వర్షం, గాలి దూమారాలు వచ్చినప్పుడు విద్యుత్ నిలిచిపోతుందని... ఆ నానుడిని అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. సంఘం నాయకులు లేవనేత్తిన డిమాండ్లు, పదోన్నతులు... సంఘం నూతన భవన నిర్మాణంపై ప్రభాకర్ రావు సానుకూలంగా స్పందించారు.
'విద్యుత్ ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి' - Tsgenco_Transco_Md prabhakar rao
ఖైరతాబాద్‌లో తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ సంఘం నూతన డైరీ, క్యాలెండర్లను టీఎస్ జెన్కో ఎండీ ప్రభాకర్ రావు పలువురితో కలిసి ఆవిష్కరించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని విద్యుత్ శాఖ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
'విద్యుత్ ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి'
ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో "మందర మకరందం" పుస్తకావిష్కరణ