తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగుల పక్షపాతి'

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని కొనియాడారు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగేందర్ గౌడ్. పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయస్సును పెంచడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

'ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగుల పక్షపాతి'
'ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగుల పక్షపాతి'

By

Published : Mar 23, 2021, 5:39 PM IST

ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయస్సును పెంచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బషీర్​బాగ్​లోని రాజీవ్ విద్యా మిషన్ కార్యాలయంలో ఆ సంస్థ ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారన్నారు. ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలు నోళ్లు మూయించారని... ఇలాంటి అభివృద్ధి పనులు జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసి చూపించాలని సవాల్ విసిరారు. త్వరలోనే నిరుద్యోగ భృతి, ఉద్యోగుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:అసెంబ్లీ ముట్టడికి గంగపుత్ర సంఘం యత్నం.. స్వల్ప ఉద్రిక్తత!

ABOUT THE AUTHOR

...view details