తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగస్టు 25 నుంచి ఆన్​లైన్​లో ఈసెట్ అభ్యర్థుల కొత్త హాల్​ టికెట్లు - tsecet online hall tickets available in online

ఈనెల 25 నుంచి ఈసెట్ అభ్యర్థులకు వెబ్​సైట్​లో కొత్త హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కన్వీనర్ మంజూర్​ హుస్సేన్ వెల్లడించారు. ఆగస్టు 31న ఆన్​లైన్​లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్​లలో ఈ సెట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు హుస్సేన్ తెలిపారు.

tsecet  online hall tickets available in online
ఆగస్టు 25 నుంచి ఆన్​లైన్​లో ఈసెట్ అభ్యర్థుల కొత్త హాల్​ టికెట్లు

By

Published : Aug 20, 2020, 11:11 PM IST

ఈసెట్ అభ్యర్థులు వెబ్​సైట్ నుంచి సవరించిన కొత్త హాల్ టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 25 నుంచి కొత్త హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త హాల్​ టికెట్లనే పరీక్షా కేంద్రాల్లో చూపించాలని కన్వీనర్ తెలిపారు.

ఆగస్టు 31న ఆన్​లైన్​లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్​లలో ఈ సెట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 52, ఏపీలో నాలుగు కేంద్రాల్లో ఎంట్రెన్స్ ఉంటుందన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆన్​లైన్​ పరీక్షపై గ్రామీణ విద్యార్థులకు మాక్​టెస్ట్ నిర్వహించనున్నట్లు మంజూర్​ హుస్సేన్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details