టెస్కాబ్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ పదవులకు కొండూరు రవీందర్రావు, గొంగిడి మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో... ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహకార శాఖ ఎన్నికల అథారిటీ ప్రకటించింది. కొత్త ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ పదవులకు ఎన్నికైన రవీందర్ రావు, మహేందర్ రెడ్డికి, డైరెక్టర్లకు మంత్రి నిరంజన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో రైతు సమన్వయ సమితిని త్వరలోనే రైతుబంధు సమితిగా మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి తెెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి ఏటా 60 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.