ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను పునః ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య అన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. మార్చి మొదటి వారం నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించి విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని సర్కారుకు గతంలోనే విన్నవించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: టీఎస్ యూటీఎఫ్ - పాఠశాలల పునః ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన టీఎస్ యూటిఎఫ్
బుధవారం నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య అన్నారు. ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: టీఎస్ యూటీఎఫ్
ప్రతీ సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు మించి ఉండకూడదన్న కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించాలని జంగయ్య అన్నారు. అందుకోసం అవసరమైన ఉపాధ్యాయులను పదోన్నతుల ద్వారా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే విద్యావాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.