తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​పై​ అసంతృప్తి వ్యక్తం చేసిన టీఎస్ యూటీఎఫ్ - Hyderabad District News

వార్షిక బడ్జెట్​లో విద్యారంగానికి కేటాయించిన నిధులపై తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పన కోసం... ఏటా కనీసం రూ. 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేసింది.

TS UTF dissatisfied with budget
బడ్జెట్​పై​ అసంతృప్తి వ్యక్తం చేసిన టీఎస్ యూటీఎఫ్

By

Published : Mar 19, 2021, 5:06 AM IST

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వాగతించింది. అయితే బడ్జెట్ కేటాయింపులు మాత్రం అందుకు తగ్గట్లుగా లేవని అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన 2021-22 వార్షిక బడ్జెట్​లో పాఠశాల విద్యకు కేవలం రూ. 11,735 కోట్లు మాత్రమే కేటాయించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 2000 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించటం సమంజసంగా లేదని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధికి కోసం ఏటా కనీసం రూ. 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:'విరాటపర్వం' టీజర్: ప్రేమకు ఇంత శక్తి ఉందా?

ABOUT THE AUTHOR

...view details