ఉపాధ్యాయులకు సమాచార భాండాగారం, ఉద్యమ కరదీపిక టీఎస్ యూటిఎఫ్ డైరీ అని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. దీనిలోని విలువైన సమాచారాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ దోమలగూడలో సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. 2021 సంవత్సరం డైరీ, క్యాలెండర్, అధ్యాపకదర్శిని 38ని విడుదల చేశారు.
'డైరీ.. ఉపాధ్యాయుల సమాచార భాండాగారం' - hyderabad latest news
టీఎస్ యూటిఎఫ్ డైరీ ఉపాధ్యాయులకు సమాచార భాండాగారం, ఉద్యమ కరదీపిక అని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్ దోమలగూడలో సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నూతన డైరీ, క్యాలెండర్లను విడుదల చేశారు.
టీఎస్ యూటిఎఫ్ డైరీని విడుదల చేసిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
తాను ఉపాధ్యాయునిగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి, ఉపాధ్యాయ ఉద్యమంలో నాయకునిగా ఎదగడానికి యూటీఎఫ్ డైరీలోని సమాచారం ఎంతగానో ఉపయోగపడిందని.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య అన్నారు. కిందటి సంవత్సరంలో విద్యారంగం, ఉపాధ్యాయ ఉద్యోగుల సర్వీసు విషయాలపై వచ్చిన ముఖ్య జీఓలన్నీ కలిపి అధ్యాపక దర్శిని 38గా ముద్రించినట్లు ప్రధాన కార్యదర్శి రవి తెలిపారు.
ఇదీ చదవండి:లారీ కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు