కేంద్ర ప్రభుత్వం ఇంధన, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి మధ్యతరగతి ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులపై పెనుభారం మోపిందని.. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. కేంద్రం మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును అంధకారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'పట్టభద్రులు వారికే ఓటు వేసి గెలిపించాలి' - ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్
ప్రజల ఐక్యత, సమస్యలపై పోరాడే అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా ఎన్ను కోవాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పేర్కొంది. విద్యావంతులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా.. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి నాగేశ్వర్, వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డిలను గెలిపించాలని ఫెడరేషన్ అధ్యక్షుడు కె.జంగయ్య విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల కోసం పాటుపడే విశ్వాసం కలిగిన వారికే ఓటు వేయాలని ఆయన కోరారు. ఎన్నికలు జరిగే 2 స్థానాల్లో విద్యావేత్త, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్, వామపక్షాల అభ్యర్థి జయ సారధి రెడ్డిలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని.. యుటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి విన్నవించారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను.. పెద్దల సభలో వినిపించి వాటి పరిష్కారానికి విశేషంగా కృషి చేశారని రవి అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కలిసి ఈ మేరకు సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి :'ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం'