TS Stamps and Registrations Revenue Decreased : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ ఆదాయం.. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా రావడం లేదు. గడిచిన ఆరు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య.. స్వల్పంగా తగ్గినా స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువలు పెరగడంతో రాబడిలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్లు కొనసాగినట్లయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా నిర్దేశించిన లక్ష్యం మొత్తంలో 70 శాతానికి మించిఆదాయం వచ్చేట్లు లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.
CAG report on Telangana state taxes : రాష్ట్ర ఖజానాకు కాసుల పంట.. కాగ్ నివేదిక విడుదల
Telangana Finance Deparatment :తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గత ఆర్ధిక ఏడాది 2022-23లో నిర్దేశించకున్న లక్ష్యం రూ.15,600 కోట్లు మొత్తానికి గానూ.. 19.51 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగి రూ.14,291 కోట్లు రాబడి వచ్చింది. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 91.21శాతం. అయితే 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10.66 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.7103.80 కోట్లు రాబడి వచ్చింది.
ఇది ఈ ఆర్ధిక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం రూ.18,500 కోట్లు మొత్తంలో కేవలం 38 శాతమే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన రాబడులను పరిశీలిస్తే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయంలో స్వల్పంగా కోతపడింది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆశించిన మేర రాబడి సమకూరినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.