కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన... అధికార పార్టీ విధానాల వల్ల ప్రజల్లో సందేహాలు నెలకొంటున్నాయని వాపోయారు. పార్టీ గుర్తులకు ఓటేసి ప్రజలు గెలిపిస్తే ఇతర పార్టీల బాట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్పై... ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని రావుల సూచించారు.
'కేసీఆర్ తీరు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం' - కాంగ్రెస్ పార్టీ
కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య సంక్షోభం ఏర్పడుతుందని తెతెదేపా నేత రావుల ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలన్నీ కలిసి.. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని సూచించారు.
'ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్యన్ని కాపాడుదాం'
Last Updated : Mar 23, 2019, 7:42 PM IST