TS RTC runs special buses for Dussehra: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈనెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. నగరంలో ప్రధాన బస్స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్లతో పాటు, కూకట్ పల్లి, దిల్సుక్ నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ చార్జీలతోనే స్పెషల్ బస్సులు - హైదరాబాద్ తాజా వార్తలు
TS RTC runs special buses for Dussehra: దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్‌తో నగరంలోని మరిన్ని పాయింట్‌ల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ నెల 24నుంచి అక్టోబర్ 5 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
TS RTC