తెలంగాణ

telangana

ETV Bharat / state

'మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి' - ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కమిటీ డిమాండ్​

ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీనియర్​ పాత్రికేయులు పాశం యాదగిరి ఆధ్వర్య్ంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

'మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

By

Published : Oct 25, 2019, 5:28 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జస్టిస్​ చంద్రకుమార్​ అన్నారు. చట్టం ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులతో చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి అన్నారు. పెండింగ్​ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

'మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ABOUT THE AUTHOR

...view details