తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇతర రాష్ట్రాల వాహనాలకు టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. ఎందుకంటే - TS registration mandatory vehicles other states

TS Registration Is Mandatory For Other States Vehicles: హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వాహనాలకు అక్కడి ఎన్‌వోసీ ఉంటే ఇకపై సరిపోదు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌ నంబరు కూడా ఉండాలి. వాటిని ఇక్కడికి తెచ్చాక జీవితకాల పన్నులు చెల్లించినా రిజిస్ట్రేషన్‌ వెంటనే మార్చుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

TS Registration Is Mandatory For Vehicles Other States
TS Registration Is Mandatory For Vehicles Other States

By

Published : Oct 17, 2022, 6:29 AM IST

TS Registration Is Mandatory For Other States Vehicles: ‘‘హైదరాబాద్‌లోని ఓ కళాశాల విద్యార్థి విజయ్‌.. సెకెండ్‌ హ్యాండ్‌ బైక్‌ను రూ.60వేలకు కోఠి సమీపంలో నెలల కిందట కొన్నాడు. రిజిస్ట్రేషన్‌ పత్రాలూ తీసుకున్నాడు. ఇటీవల తనిఖీల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఆ పత్రాలు పరిశీలించగా.. అది దొంగిలించిన బైక్‌గా తేలింది. వారు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ కావాలనుకుంటే దొంగ దొరికేంత వరకు ఆగాలన్నారు. దీంతో అసలా బండే వద్దంటూ పత్రాలు పోలీసులకు ఇచ్చేశాడు. రూ.60వేలు నష్టపోయాడు’’

* ‘‘దిల్లీలో కార్లు తక్కువ ధరలకు అమ్ముతారని విని బేగంబజార్‌కు చెందిన ఓ ఉద్యోగి రెండు నెలల కిందట అక్కడకు వెళ్లాడు. కరోల్‌బాగ్‌లోని ఓ సెకెండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూంలో రూ.3 లక్షలకు డీజిల్‌ కారు కొన్నాడు. అక్కడి నుంచి నిరభ్యంతర పత్రం తీసుకొచ్చాడు. తర్వాత ఓ రోజు రవాణాశాఖ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. లైఫ్‌ ట్యాక్స్‌, హరిత పన్ను రూ.2లక్షలు చెల్లించాలన్నారు. అలా దిల్లీ కారుకు మొత్తంగా రూ.5లక్షలు పెట్టినట్లయింది.’’

* హైదరాబాద్‌ నగరంలో ఇటీవల జరిగిన సంఘటనలివి. దిల్లీ, ముంబయి కేంద్రాలుగా ఖరీదైన కార్లు, బైకులు దొంగిలిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాలు వాటిని హైదరాబాద్‌లో అమ్మేస్తున్నాయి. ఇవేవీ తెలియనివారు తక్కువ ధరలకు కార్లు, బైకులు వస్తున్నాయని కొంటున్నారు. పోలీసుల తనిఖీల్లో అసలు విషయం తేలడంతో భవిష్యత్తులో కేసులు, కోర్టుల వ్యవహారం ఎందుకంటూ వారికే అప్పగిస్తున్నారు.

ఏం చేయాలి..

* ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొని తెస్తే... మీ చిరునామా ఆధారంగా రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాలి. అక్కడి అధికారులకు విషయాన్ని వివరిస్తే.. కట్టాల్సిన పన్ను, ఫీజులు, టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు పొందే తీరుతెన్నులన్నీ చెప్తారు. లేదంటే ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖకు వాహనాలను స్వాధీనం చేసుకొనే అధికారం ఉంది.

హైదరాబాద్‌లో పోటెత్తుతున్న వాహనాల వరదకు ఇతర రాష్ట్రాల బండ్లు అదనంగా చేరుతున్నాయి. వాటికి అక్కడి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఉంటే సరిపోదు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌ నంబరు కూడా ఉండాలని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే.. వాటిని ఇక్కడికి తెచ్చాక జీవితకాల పన్నులు చెల్లించినా రిజిస్ట్రేషన్‌ సైతం వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అక్కడ పన్ను కట్టినా ఇక్కడా చెల్లించాల్సిందే:ఏటా 10 వేలకుపైగా ఇతర రాష్ట్రాల వాహనాలు హైదరాబాద్‌కు వస్తున్నాయని రవాణాశాఖ అధికారుల అంచనా. అక్కడ జీవితకాల పన్ను చెల్లించి మళ్లీ ఇక్కడ ఎందుకు కట్టాలంటూ కొందరు మిన్నకుండిపోతున్నారు. అయితే, అక్కడ పన్ను చెల్లించినా.. హైదరాబాద్‌కు వచ్చాక వాహనం ఖరీదు ఆధారంగా పన్ను కట్టాల్సిందే.

* ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన వ్యక్తి వెంట తెచ్చుకున్న తన కారుకు కేవలం ఇక్కడ జీవితకాల పన్ను చెల్లిస్తే సరిపోదు. దానికి టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ తప్పక ఉండాలి. కానీ, ఏపీ నంబరుతోనే రాకపోకలు కొనసాగిస్తున్న ఆ వ్యక్తి రెండు, మూడేళ్ల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్తే ఆ కారుకు టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ లేనందున అప్పుడక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇవీ చదవండి:ప్రశాంతంగా గ్రూప్​1 ప్రిలిమినరీ పరీక్ష.. 75 శాతం హాజరు నమోదు

హిందీ MBBS బుక్స్​ విడుదల.. త్వరలోనే తెలుగులో ఇంజినీరింగ్ కోర్సులు!

ABOUT THE AUTHOR

...view details