TS PGECET 2023 Web Options:తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 1, 2023 నుంచి ప్రారంభమైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) అనేది.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ (ME / M.Tech./ M.Pharmacy / M.Arch), గ్రాడ్యుయేట్ స్థాయిలలో రెగ్యులర్ PG కోర్సులలో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి సాధారణ ప్రవేశ పరీక్ష.
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS PGECET వెబ్ ఆప్షన్స్ లింక్ నమోదు ప్రక్రియను అధికారిక వెబ్‌సైట్‌లో pgecetadm.tsche.ac.in సెప్టెంబర్ 1, 2023 నుంచి అందుబాటులోకి తెచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్‌లను సెప్టెంబరు 2, 2023 వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఆప్షన్లను తుది సవరణలు చేయడానికి వీలు కల్పిస్తారు. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా ఫేజ్ 1 అడ్మిషన్ కోసం జాబితాను సెప్టెంబర్ 6, 2023న విడుదల చేస్తారు.
TS PGECET వెబ్ ఆప్షన్స్ 2023ని ఎలా ఎక్సర్‌సైజ్ చేయాలి?..
How to Exercise TS PGECET Web Options 2023?..
- TS PGECET అధికారిక వెబ్‌సైట్ 'pgecetadm.tsche.ac.in' ని ఓపెన్ చేయండి.
- వెబ్‌సైట్ హోమ్‌పేజీలో 'వెబ్ ఆప్షన్‌లు(Web Options)' లేదా 'ఛాయిస్ ఫిల్లింగ్' పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ (PGECET)/, (GPAT), స్కోర్ (గేట్) మార్కులు వంటి లాగిన్
- ఆధారాలను నమోదు చేసి.. ఆపై లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- మీ కోర్సు ఆధారంగా.. కాలేజీలను ఎంపిక చేసుకోవాలి.
- అనంతరం ఆప్షన్లను సేవ్ చేయాలి.