TS PGCET counseling : ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జేఎన్టీయూల్లోని మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం 24,278 సీట్లు మిగిలాయి. మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత షెడ్యూలులో భాగంగా నేటి నుంచి ఈనెల 18 వరకు ఆన్లైన్ ధ్రువపత్రాల పరిశీలన కోసం రిజిస్ట్రేషన్లు ఉంటాయని కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
TS PGCET counseling : పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్
TS PGCET counseling: రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లోని సంప్రదాయ పీజీ కోర్సుల భర్తీకి నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఈనెల 30న రెండో విడత పీజీ సీట్లను కేటాయిస్తారు.
TS PGCET counseling
ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. ఈనెల 27న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించి.. ఈనెల 30న రెండో విడత పీజీ సీట్లను కేటాయిస్తారు. ఈనెల 31 నుంచి జనవరి 5 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:Harish Rao review on covid: '21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు కొనుగోలు చేయండి'