పీవీకి నివాళులర్పించిన పలు దేశాల ఎన్నారైలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల్టా, స్వీడన్లో, ఒమాన్‌లో, అమెరికాలోని బోస్టన్‌లో, లండన్‌లో, ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పీవీని గౌరవించేలా 50 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎన్.ఆర్.ఐలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్వీడన్లో..
అపర చాణుక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు స్వీడన్లో సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీడన్ తెలుగు అసోసియేషన్ సభ్యులతో కలిసి తెలుగు వారంతా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ తరపున వంశీరెడ్డి ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఒమాన్‌లో తెలంగాణ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ, తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖలు సంయుక్తంగా పీవీ నర్సింహారావు శాతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.
లండన్‌లో పీవీ..
అమెరికాలోని బోస్టన్ నగరంలో పలువురు ఎన్నారైలు పీవీకి నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో పీవీ జయంతిని జరిపారు. తెలంగాణ జాగృతి బహ్రెయిన్ ఆధ్వర్యంలో, లండన్‌లో పీవీ జయంతి ఉత్సవాలు జరిపారు. లండన్‌లో జరిగిన పీవీ జయంతి ఉత్సవాల్లో లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, వాణిదేవి, మహేష్ బిగాల, లండన్ ఎంపీలు పాల్గొన్నారు. యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, బారిస్టర్లు, డాక్టర్లు, విద్యావేత్తలు, సాఫ్ట్ వీర్ నిపుణులు, భారత సంతతి యూకే రాజకీయ ప్రతినిధులు, తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు 9 టీడీఫ్, జాగృతి, యుక్త , తాల్, తార, ఇలా వివిధ రంగాలకు చెందిన 130 మంది ఎన్నారైలు పాల్గొన్నారు. ప్రసంగాల అనంతరం జయప్రకాశ్, వాణిదేవిలతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి :ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి.. కేంద్ర బృందం సూచన