తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై పన్ను తగ్గించాలి' - hyderabad news

కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్​పై పన్ను తగ్గించి వెంటనే వాటి ధరలు తగ్గేటట్లు చూడాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.

ts lorry owners association happy on petrol rates
లారీ ఓనర్స్ అసోసియేషన్

By

Published : Nov 4, 2021, 2:23 PM IST

కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్న పెట్రో ధరలు నుంచి కాస్త ఉపశమనం కలిగింది. చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో తెలంగాణలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నందా రెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని ఆటో నగర్​లో లారీ యజమానులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వలన కొంత ఊరట లభించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్​పై పన్ను తగ్గించాలి. వెంటనే పెట్రో ధరలు తగ్గేటట్లు చూడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వమే నేరుగా చర్యలు తీసుకోవాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

నందా రెడ్డి, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం.. రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని నందారెడ్డి వ్యాఖ్యానించారు. వాహనదారులను దృష్టిలో ఉంచుకొని తెరాస ప్రభుత్వం ధరలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, లారీ యజమానులు పాల్గొన్నారు.

లారీ ఓనర్స్ అసోసియేషన్ సంబురాలు

ఇదీ చూడండి:Fuel Price: తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

ABOUT THE AUTHOR

...view details