తెలంగాణ

telangana

'సిబ్బందిని ఇబ్బంది పెడితే.. కళాశాలలకు గుర్తింపు రద్దు!'

By

Published : Sep 11, 2020, 4:16 PM IST

ప్రైవేట్ జూనియర్​ కళాశాలల యాజమాన్యాలు.. సిబ్బందిని తొలగించినా, వేతనాలు ఇవ్వకపోయినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఇంటర్మీడియర్​ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్​ జలీల్​ హెచ్చరించారు.

telangana inter board on salaries to staff
'సిబ్బందిని ఇబ్బంది పెడితే.. కళాశాలలకు గుర్తింపు రద్దు!'

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగాలు తొలగించవద్దని, ప్రతి ఒక్క సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో 45ను విడుదల చేసిందని తెలంగాణ ఇంటర్మీడియర్​ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్​ జలీల్​ పేర్కొన్నారు. అయినప్పటికీ.. పలు ప్రైవేట్ జూనియర్​ కళాశాలల యాజమాన్యాలు సిబ్బందిని తొలగించడం, వారికి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం వంటివి చేసి ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జలీల్​ తెలిపారు.

యాజమాన్యాలు.. సిబ్బందిని తొలగించినా, వేతనాలు ఇవ్వకపోయినా.. అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జలీల్ హెచ్చరించారు. కళాశాలలకు గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా నిర్దేశిత అర్హతలు ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది లేకపోతే.. ఈ ఏడాది అనుబంధ గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని ఇంటర్​ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

ఇదీ చదవండిఃవిద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details