TS Inter First Year Admission Registration 2023 : తెలంగాణలో పదో తరగతి పాసై ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందడానికి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ గడువును ఇంటర్ బోర్డు పలుమార్లు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చివరి అవకాశంగా ఇంటర్ తొలి ఏడాది ప్రవేశానికి గడువును అక్టోబర్ 9 వరకు బోర్డు కల్పించింది. అంటే ఇవాళే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి చివరి తేదీ. ఇంకా ఇప్పటి వరకు ప్రవేశాలు తీసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు(Intermediate Board) కోరింది. మరోసారి 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి అడ్మిషన్ రిజిస్టేషన్ డేట్ పొడిగించబడదని పేర్కొంది.
TS Inter First Year Admission 2023 Registration Ends Today : ఇంకా ఎవరైనా 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇంటర్లో అడ్మిషన్ తీసుకోకపోతే ఇప్పుడే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ప్రథమ సంవత్సరానికి అప్లై చేసుకోవచ్చు. రూ. వెయ్యి ఆలస్య రుసుము మీరు ఏదైనా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో(Private Junior Colleges)అడ్మిషన్ పొందడానికి చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు ప్రభుత్వ కళాశాలలో అందించే కోర్సులలో చేరాలనుకుంటే ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన పని లేదు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కళాశాల్లోనే చేరాలని విద్యార్థులకు బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిని కాలేజీల జాబితానూ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ టీఎస్‌బీఐఈ(TSBIE)లో అందుబాటులో ఉంచింది.
Telangana Board of Intermediate Education 2023 : అయితే గతంలో మాదిరిగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందడానికి మీరు ఎంచుకున్న కాలేజీకి వెళ్లి అడ్మిషన్ పొందాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నచోటు నుంచే ఆన్లైన్లో చాలా సింపుల్‌గా ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..