ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూలును ఇంటర్ బోర్డు ప్రకటించింది. నేటి నుంచి జులై 5 వరకు మొదటి విడత ప్రవేశాలను చేపట్టనున్నట్లు తెలిపింది. జూన్ 1 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ప్రారంభించనున్నట్లు.. బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.
జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు - inter admissions 2021
రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాలకు షెడ్యుల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5 వరకు మొదటి విడత ప్రవేశాలను చేపట్టనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌కు.. 88 మంది విద్యార్థులకు మించి తీసుకోరాదని బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు.. ప్రవేశాల ప్రక్రియలో ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది . ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ కళాశాలలన్నింటికీ నియమాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలని.. బోర్డు కార్యదర్శి జలీల్ కోరారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు