హైదరాబాద్ సచివాలయం గేటు ఎదుట భాజపా నేతలు దత్తాత్రేయ, మురళీధర్‌రావు ఆందోళన చేపట్టారు. గ్లోబరీనా, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలకై భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన నేతలను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయి: దత్తాత్రేయ - bjp
ఇవాళ రాష్ట్ర బంద్‌కు భాజపా పిలుపునివ్వగా... ఎక్కడిక్కడ అరెస్ట్‌లు జరుగుతున్నాయి. సచివాలయం గేటు ముందు ఆందోళన చేపట్టిన భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కారుకు బ్రేకులు పడనున్నాయి: దత్తాత్రేయ