తెలంగాణ

telangana

ETV Bharat / state

కానిస్టేబుల్‌ పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరించిన హైకోర్టు ధర్మాసనం - Telangana High Court

TS High Court Verdict on Telangana Police Constable Exam : కానిస్టేబుల్‌ పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ధర్మాసనం సవరించింది. సివిల్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఇచ్చింది. ఈ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరిస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Telangana High Court
Telangana High Court

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 5:10 PM IST

Updated : Jan 4, 2024, 8:05 PM IST

TS High Court Verdict on Telangana Police Constable Exam :పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు(Telangana High Court) ధర్మాసనం సవరించింది. కానిస్టేబుళ్ల తుది రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని సింగిల్ బెంచ్ గత ఏడాది అక్టోబర్‌లో ఇచ్చిన తీర్పును జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు ధర్మాసనం సవరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుల సాయం తీసుకొని స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది.

అభ్యంతరాలున్న నాలుగు ప్రశ్నలపై స్వతంత్ర నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తుది అర్హత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వాటికి ఇచ్చిన ఐచ్ఛికాలను తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల సరైన సమాధానం గుర్తించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రశ్నలకు సమాధానం రాసిన అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి.మాధవి పోలీస్ నియామక మండలి(Police Recruitment Board)ని ఆదేశించింది.

Telangana Constable Results Released 2023 : కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు వెల్లడి

Telangana HC Set Aside Single Bench Verdict on TS Constable Exam : ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు పోలీస్ నియామక మండలి కూడా హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. నాలుగు ప్రశ్నలకు ఇచ్చిన ఐచ్ఛికాలు వాడుక భాషలో ఉన్న పదాలేనని ఆ పదాలను తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల అభ్యర్థులు తికమకపడటానికి అవకాశమే లేదని పోలీస్ నియామక మండలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తుది పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులే నియామక ప్రక్రియకు అవాంతరం కలిగించేందుకు పిటిషన్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక ప్రక్రియలో ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం స్వతంత్ర నిపుణుల కమిటీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా 4వారాల్లో పోలీస్ ఉద్యోగాల(Police Jobs) నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. పోలీస్ నియామక మండలి 15వేలకు పైగా సివిల్, స్పెషల్ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ జారీ చేసింది. గతేడాది ప్రాథమిక అర్హత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది అర్హత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. సివిల్ కానిస్టేబుళ్లకు సంబంధించి దాదాపు 5వేల పోస్టులు భర్తీ చేసే సమయంలో కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది.

పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. సిలబస్‌ ఏంటో చూసేయండి మరి

మెగా డీఎస్సీపై కసరత్తు - ఖాళీల లెక్క తేలుస్తున్న అధికారులు

Last Updated : Jan 4, 2024, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details