తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు - murder of the lawyers NEWS

high
న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

By

Published : Feb 18, 2021, 11:08 AM IST

Updated : Feb 18, 2021, 12:59 PM IST

11:05 February 18

న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

న్యాయవాదుల హత్యపై హైకోర్టు స్పందించింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్యను ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసింది.  నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది. 

లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని వెల్లడించింది. హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. నోటీసులు జారీ చేసిన ధర్మాసనం... కేసు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

Last Updated : Feb 18, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details