దళిత బంధుపై అత్యవసర విచారణకు మరోసారి నో చెప్పిన హైకోర్టు - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు
12:14 August 06
దళిత బంధుపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించిన హైకోర్టు
దళితబంధు పథకంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. వాసాలమర్రిలో దళితబంధు పథకం కింద 7 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై అత్యవసర విచారణ జరపాలని సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనాన్ని న్యాయవాది నరేష్ కోరారు.
ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున ఇవాళ విచారణ జరపాలని కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి నిరాకరించిన హైకోర్టు.. ఇప్పటికే ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని పేర్కొంది.
ఇదీ చూడండి:cm kcr: 'వాసాలమర్రిలో 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు'