'ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు' నిబంధనపై హైకోర్టులో విచారణ - High Court latest news
12:50 November 12
'ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు' నిబంధనపై హైకోర్టులో విచారణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులన్న నిబంధనపై హైకోర్టులో విచారణ జరిగింది. శ్రీధర్‌బాబు రవి, మహమ్మద్ తాహెర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
మున్సిపాలిటీల్లో పోటీకి అర్హులుగా ప్రభుత్వం చట్టసవరణ చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మాత్రం అనర్హులుగా పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వెల్లడించారు. దీనిపై ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.