రోగులనుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ గతంలో రాష్ట్రవ్యాప్తంగా 22 ఆసుపత్రుల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది. ఇవాళ ఆ ఆస్పత్రులకు తిరిగి కొవిడ్ చికిత్స చేసేందుకు లైసెన్సులు జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేయటం వల్ల వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న ఇతర ప్రైవేటు ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న కోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకునట్టు ఉత్తర్వుల్లో డీహెచ్ పేర్కొన్నారు.
TS News: ఆ ఆసుపత్రులకు లైసెన్సులు పునరుద్ధరించారు.. - telangana varthalu
కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న అభియోగాలపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ సేవలు రద్దైన 22 ఆస్పత్రుల లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో తమపై వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించుకోవటంతో పాటు... బాధితుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను రెండు వారాల్లోపూ తిరిగి చెల్లించాలని ఆయన ఆసుపత్రులను ఆదేశించారు. మరోసారి అధిక ఛార్జీలు వసూలు చేయరాదని ప్రైవేటు ఆస్పత్రులకు స్పష్టం చేసిన డీహెచ్ ... పరిస్థితులు పునరావృతం అయితే ఈసారి లైసెన్సులు రద్దు చేసి యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ పునరుద్ధరణతో కొవిడ్ లైసెన్సులు రద్దయిన 22 ఆస్పత్రులు తిరిగి కరోనా వైద్య సేవలను అందించనున్నాయి.
ఇదీ చదవండి: ఊబకాయులకు గుడ్న్యూస్- బరువు తగ్గడానికి ఇంజెక్షన్!