రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ - రైతుబంధు వివరాలు
13:57 June 16
రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ
రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 23న సీసీఎల్ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదార్లకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదార్లకు రైతుబంధు వర్తిస్తుంది. ప్రభుత్వం రైతుబంధు కోసం ఏడాదిలో ఒకసారి వివరాలు పరిగణనలోకి తీసుకోనుంది. ప్రతి సీజన్‌కు ముందు భూముల లావాదేవీల పరిశీలించనుంది. అమ్మిన భూముల వివరాలు జాబితా నుంచి తొలగించనున్నారు.
కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు ఇవ్వనున్నారు. దశలవారీ నిధుల విడుదలలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. రైతుబంధును వదులుకునే వారు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. గివ్ ఇట్ అప్ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామని స్పష్టం చేసింది. పెద్దపల్లి కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగుచేస్తున్న 621 మందికి రైతుబంధు ఇవ్వనున్నారు.